టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక దశాబ్దం పైగా ఏలింది సమంత. ఇక ఇప్పుడు కాస్త తన రూట్ ను మార్చి సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే పాత్రలను ఎంచుకునే సమంత ఇప్పుడు దాదాపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం తను అటు తెలుగులో చేస్తూనే మరోపక్క తమిళ్, అలానే హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. వీటిలో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుండగా.. యశోద సినిమా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా యశోద సినిమా కాస్త డిఫరెంట్ ఫిలిం అని తెలుస్తుంది. ఇక ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండగా వాటిని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. గతంలో సమంతతో కలిసి‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. ఇక వీటిపై దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ.. ఈసీక్వెన్స్ హైద్రాబాద్ లోనే జరిగాయి. షూటింగ్ కు ముందు సమంత ఈ యాక్షన్ సీక్వెన్స్ రిహార్సల్ చేస్తానని చెప్పింది.. ఒక నాలుగు రోజుల పాటు మాత్రమే బెన్ తో రిహార్సల్స్ చేసింది.. అయినా కూడా చాలా బాగా ఇంటెన్స్ తో యాక్షన్ సీక్పెన్స్ లో నటించింది. ఈసినిమా కోసం ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోలేదు సమంత.. అప్పటికప్పుడు చేసిన యాక్షన్ సీక్వెన్సే అన్నీ.. ఈసినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి.. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్పారు.
కాగా సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో హరి, హరీష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































