గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి సినిమా కూడా ఒకటి. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూన్ 10న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనితో పాటు దసరా సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.34 నిమిషాలకు ఈ అప్డేట్ రిలీజ్ కానుంది. అయితే అది గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ లేదా ఈ రెండూ రావొచ్చూ’ అంటూ సస్పెన్స్ లో పెట్టారు. మరి చూద్దాం ఏం అప్ డేట్ వస్తుందో.
First look ? A glimpse ? Or both ?
Tomorrow 11.34AM 🙂#DASARA pic.twitter.com/ft0aKa7reE
— Nani (@NameisNani) March 19, 2022
కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: