లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , ఫిల్మ్ యాక్టర్ , పొలిటీషియన్ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నార్నే ఎస్టేట్స్ అధినేత నార్నే శ్రీనివాస్ తనయ లక్ష్మి ప్రణతిని 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్ , భార్గవ్ రామ్ తనయులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ కుటుంబం తిరుమలను సందర్శించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జూ.ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ నుదిటిన విష్ణు నామం తో సాంప్రదాయ దుస్తులలో కనిపించాడు. భార్గవ్ కి అన్నీ ముత్తాత ఎన్టీఆర్ పోలికలే. సీనియర్ ఎన్టీఆర్ లానే భార్గవ్ ముఖ కవళికలు ఎంతో తేజస్సుతో తేజోమయంగా ఉన్నాయి. అచ్చు గుద్దినట్టు ఎన్టీఆరే నంటూ నందమూరి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ బాలుడిలో ఏదో మాయ మహత్తు కనిపిస్తోందనేది పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































