డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. ఇప్పటికే కబ్జా సినిమాతో వస్తున్నాడుఉపేంద్ర. 1970బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో సుదీప్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు ఉపేంద్ర. ఈసినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈసినిమాకు యూ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్ అయితే చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటుంది.

కాగా హీరోగా నటిస్తూనే ఉపేంద్ర ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని లహరి ఫిలింస్ ఎల్ఎల్పీ, వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా .జి. మనోహరన్, శ్రీకాంత్ కెపి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























