మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్” , స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ “, కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో “చిరంజీవి 154 ” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాల షూటింగ్స్ లో చిరంజీవి ఒకే సారి పాల్గొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొణిదెల ప్రొడక్షన్స్ , ఎన్ వి ఆర్ సినిమాస్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, సత్యదేవ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. నయన తార పాల్గొన్న ”గాడ్ ఫాదర్ ” మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. “గాడ్ ఫాదర్ “మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























