‘స్వాతిముత్యం’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Swati Mutyam Movie First Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Swati Mutyam,Swati Mutyam Movie,Swati Mutyam Telugu Movie,Swati Mutyam Upcoming Movie,Swati Mutyam Latest Updates,Swati Mutyam Movie Updates,Swati Mutyam First Glipse, Swati Mutyam Movie Glimpse Out Now,Bellamkonda Ganesh Babu,Bellamkonda Ganesh Swati Mutyam,Bellamkonda Ganesh In Swati Mutyam Movie First Look,Varsha Bollamma And Bellamkonda Ganesh, Hero Bellamkonda Sai Sreenivas Brother Bellamkonda Ganesh,Bellamkonda Suresh Son Bellamkonda Ganesh,Bellamkonda Ganesh First Movie Glipse Out now,Varsha Bollamma Upcoming MOvie Swati Mutyam Producer Bellamkonda Suresh

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా చాలా లేట్ అయింది. అయితే ఈమధ్యే మళ్లీ ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే మాత్రం ఆకట్టుకుంటుంది. గణేష్ మొదటి సినిమాలో చాాలా ఈజ్ గా నటించాడని అనిపిస్తుంది. కామెడీ యాంగిల్ కూడా ఈసినిమాలో బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. చూడాలి మరి ఈసినిమా ఎలా ఉంటుందో.

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.