‘భీమ్లానాయక్’ కోసం వెనక్కి తగ్గిన ‘ఎఫ్3’

F3 Movie Release Date Postponed for Bheemla Nayak, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, F3 Movie Release Date Postponed, F3 team changes their release date, : F3: Fun and Frustration New Release Date, F3 Movie Latest Release Date, Bheemla Nayak, Bheemla Nayak Movie, Bheemla Nayak Telugu Movie, Venkatesh And Varun Tejs F3 Release Date Postponed, Venkatesh, Varun Tej, Venkatesh Latest News, Venkatesh support Pawan Kalyan, F3 postponed, F3 New release date locked, Bheemla Nayak and F3 Postponed

ఫైనల్ గా భీమ్లానాయక్ రిలీజ్ డేట్ అయితే వాయిదా పడింది. ఇక భీమ్లానాయక్ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చారు. నిజానికి ఎఫ్ 3 సినిమాను కూడా ముందు నుండి సంక్రాంతికే రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ.. పెండింగ్ పనులు ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను సంక్రాంతి నుండి ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరికి రావడంతో ఎఫ్ 3ను వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు. నేడు ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు.. భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్టు అలానే ఎఫ్ 3 ను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు. సర్కారు వారి పాట ఏప్రిల్1న, కె.జి.యఫ్2 ఏప్రిల్ 14న ఉండటంతో ఎఫ్ 3 ని ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎఫ్3’. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎప్ 2 సినిమాకు సిక్వెల్‏గా ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా డు డైరెక్టర్ అనిల్ రవిపూడి. తమన్నా, మెహ్రీన్ లు ఈసినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా..ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.