అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఆతరువాత వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయాలని ముందు ఫిక్స్ అయ్యారు.. కానీ మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్ కి వెంకీ స్పెషల్ టీ పార్టీ ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ‘వెంకీ బ్రో ఇంట్లో టీ టైమ్. లవ్లీ హోస్ట్ గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ ఫోటో కూడా పోస్ట్ చేశాడు.
Tea time at venky bro’s house!!
Thanks for being such a lovely host!❤️❤️❤️#F3 @VenkyMama @AnilRavipudi @tamannaahspeaks @Mee_Sunil pic.twitter.com/Sb3a15sPij— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 7, 2021
కాగా ఈసినిమాలో తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాల్ చౌహన్ ను కూడా ఈ సీక్వెల్ కోసం తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























