సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పెద్దన్న”మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
.@KeerthyOfficial shares her experience working on #Annaatthe@rajinikanth @directorsiva #Nayanthara @immancomposer @prakashraaj @IamJagguBhai @khushsundar @Actressmeena16 @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals #AnnaattheDeepavali #AnnaattheThiruvizha pic.twitter.com/5B1xapGN5R
— Sun Pictures (@sunpictures) November 4, 2021
“అన్నాత్తే ” తమిళ మూవీ విడుదల సందర్భంగా చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటించిన కీర్తి సురేష్.. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఓ వీడియోని విడుదల చేశారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందనీ ,. ఈ దీపావళికి “పెద్దన్న”మూవీ రిలీజ్ అవడం, రజనీ సార్‌తో కలిసి నటించడం, నిజంగా తన కల నిజమైందనీ , సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయనీ , బిగ్ కమర్షియల్ చిత్రమిదనీ , ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరాయనీ , ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దీపావళి కానుకగా విడుదలైందనీ , కోవిడ్‌కు సంబంధించిన ముందస్తు చర్యలు పాటిస్తూ అందరూ థియేటర్లలో ఈ చిత్రం చూసి సపోర్ట్ చేయండి.. థ్యాంక్యూ’’అంటూ కీర్తిసురేష్ ఆ వీడియో లో చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























