హీరో సుమంత్ ఈమధ్య స్పీడు పెంచాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమధ్య ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. మళ్ళీ రావా’ తర్వాత మరోసారి ‘మళ్ళీ మొదలైంది’తో సుమంత్ హిట్ కొట్టేట్టే కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
An unusual family entertainer 😘 A cheeky take on life and love after divorce. #MalliModalaindi 💚♻️
▶️ https://t.co/VFrfd7RM3t#MalliModalaindiTrailer @iSumanth @tgkeerthikumar @NainaGtweets@anuprubens @tejuppalapati #KRajashekarReddy #RedCinemas
— Sumanth (@iSumanth) October 28, 2021
కాగా ఇంకా ఈసినిమాలో పోసాని, మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























