టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళి ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సమంత తన వర్కవుట్ వీడియోలను తరచుగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సమంత హైదరాబాద్ శివారు ప్రాంతంలో జోరు వానలో సైక్లింగ్ చేశారు. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి వర్షంలో సైకిల్ రైడ్ చేయడం ఓ మధురానుభూతనీ , ఈ రోజు 21 కిలోమీటర్లు సైకిల్ తొక్కాననీ , భవిష్యత్తులో వంద కిలోమీటర్లు వెళ్లేందుకు ప్రయత్నిస్తాననీ , ‘అన్‌బ్రేకబుల్’ అనే క్యాప్షన్ తో ఆ సైక్లింగ్ వీడియో ను సమంత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఫిట్‌నెస్‌లో భాగంగా సైకిల్‌రైడ్ చేయడం గొప్ప విషయమని సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































