ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు కాగా యాక్షన్ కింగ్ అర్జున్ , సచిన్ ఖేడేకర్ , ముఖేశ్ రుషి , ఉన్ని ముకుందన్ , రావు రమేశ్, మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్యమైన పాత్ర లలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ ని దీపావళి పండగ కి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ తో పాటు ఎస్ ఎల్ వి సినిమాస్ , రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: