పలాస సినిమాతో దర్శకుడిగాతనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ శ్రీదేవి సోడా సెంటర్. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో సుధీర్ బాబు మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో అన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. ఇక రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఎలా ఉందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈగ్యాప్ లో డైరెక్టర్ కరుణ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ లెటర్ ను పోస్ట్ చేశారు. అందులో తను చిరంజీవికి ఫ్యాన్ అని.. తన చిన్నప్పుడు చిరంజీవి ఖైదీ నెం.786 సినిమా చూడటానికి ఎంత కష్టపడ్డాడో.. ఇప్పుడు అదే థియేటర్ లో తమ శ్రీదేవి సోడా సెంటర్ రిలీజ్ అవుతుందని చెబుతూ భావోధ్వెేగం అయ్యారు. అంతేకాదు నేల టికెట్ ఉంటే ఈసినిమాను నేల టికెట్ తోనే చూస్తానని.. లేకపోతే మొదటి వరుసలో కూర్చొని చూస్తా అని కూడా తెలిపారు.


కాగా ఆనంది హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























