కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది అని మేకర్స్ కూడా తొందరపడుతున్నారు. అందుకే వారానికి దాదాపు అరడజను వరకూ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు పోటీకి సిద్దంగా ఉండగా.. సెప్టెంబర్ 3న కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే అదే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాాగా ఈరేస్ నుండి సందీప్ కిషన్ తప్పుకున్నాడు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు అదే రోజులో పలు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే డేట్ మాత్రం ఎప్పుడో చెప్పలేదు కానీ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Though we have announced September 3rd as the release date of “Gully Rowdy”.. to create healthy atmosphere for other releases we are postponing the release. It’s a September release and a fresh date will be announced soon!! #GullyRowdyInSeptember pic.twitter.com/XJsMiWv6O0
— Kona Venkat (@konavenkat99) August 24, 2021
కాగా ఈ సినిమాలో తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తుండగా… చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























