సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. యంగ్ హీరోల పక్కన నటిస్తూనే మరోపక్క సీనియర్ హీరోల పక్కన జోడి కట్టేందుకు పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు శాండల్ వుడ్ ఆఫర్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you so much . Looking forward to be on the sets of #headbush !
Thanks for all love and support.
🎬⭐️🎬 https://t.co/JiIxiXy3jN— paayal rajput (@starlingpayal) August 8, 2021
డాలీ పిక్చర్స్ , సోమన్న టాకీస్ బ్యానర్స్ పై శూన్య దర్శకత్వంలో ధనంజయ్ హీరోగా బెంగళూరు ఫస్ట్ అండర్ వరల్డ్ డాన్ ఎమ్ పి జయరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా “హెడ్ బుష్ “కన్నడ మూవీ తెరకెక్కుతుంది. 60 ,70 ల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ కథానాయికగా ఎంపిక అయ్యారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 9వ తేదీ బెంగళూరు లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ ను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































