సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట అప్ డేట్ రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఆగష్ట్ 9న మహేష్ పుట్టిన రోజు వస్తుండగా ఆరోజు కూడా ట్రీట్ ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9, ఉదయం 9.09గంటలకు `సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్` పేరుతో ట్రీట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Block your calendars and lock your plans 🔥
Let’s Begin the SuperStar Birthday Extravaganza 🤩#SuperStarBirthdayBLASTER on AUG 9th @ 9:09 AM 💥
👉 https://t.co/jX9HqqaQiF #SarkaruVaariPaata 🔔 @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @KeerthyOfficial @madhie1 pic.twitter.com/w6H9ZkjJji
— Mythri Movie Makers (@MythriOfficial) August 7, 2021
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే మహేష్ తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని.. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.
పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























