పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు మరోసారి అకీరా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనికి కారణం రేణు దేశాయ్ అకీరాకు సంబంధించిన ఒక వీడియోను ఇన్ట్సాలో పోస్టే చేయడమే. తాజాగా అకీరానందన్ కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అకీరా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరాని కొనియాడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ఇప్పటికే పలు హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా.. అందరూ అకీరా ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అకీరా ఎంట్రీ ఇప్పట్లో ఉంటుందో లేక ఇంకా టైమ్ పడుతుందా అన్నది చూడాలి.
ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రానా-పవన్ కాంబినేషన్ లో వస్తున్న మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను స్టార్ట్ చేశాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: