ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా.. దానికి తోడు రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై ఆటో మేటిక్ గా అంచనాలు పెరుగుతాయి. ఇక ఈసినిమా ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇన్ని రోజులు ఇక్కడే షూటంగ్ జరుపుకున్న ఈసినిమా ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం తెలియజేస్తూ ‘‘ఆఖరి షెడ్యూల్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఉక్రెయిన్లో ల్యాండ్ అయింది’’ అని ట్వీట్ లో పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #RRRMovie arrives in #Ukraine for the last schedule of the film… Excited🕺🕺🤞🏻
— RRR Movie (@RRRMovie) August 3, 2021
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























