షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ షూటింగ్ ను హీరో నాని కంప్లీట్ చేశారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో నాని తన రియల్ ,రీల్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ లో 4 మిలియన్ ఫాలోయర్స్ , ఫేస్ బుక్ లో 5. 5 ఫాలోయర్స్ తో సోషల్ మీడియా లో దూసుకుపోతున్న హీరో నాని ఇన్ స్టా గ్రామ్ లో 4 మిలియన్ ఫాలోయర్స్ మైలు రాయిని చేరుకున్నారు. నాని హీరోగా తెరకెక్కనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. నాని హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: