యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక కరోనా కారణంగా పాగల్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేటర్ల ఓపెన్ అయిన వెంటనే రానుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు లైన్ లో ఉండగా.. ఈ సినిమాను కూడా తొందరగానే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆగష్ట్ ఫస్ట్ వీక్ లేేదా సెకండ్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రస్ నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. తీరా అనే పాత్రలో నివేదా నటిస్తుంది.ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: