“ఒరు అదార్ లవ్ “మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ మూవీలో నటించిన ప్రియా ప్రకాశ్ షూటింగ్ పూర్తి కావడంతో హాలీడే వేకేషన్‌కు రష్యా పర్యటనకు వెళ్ళారు . రష్యా రాజధాని మాస్కోలో స్నేహితులతో కలిసి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్‌కు వెళుతూ అక్కడ రోడ్లపై ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు ,వీడియోలను ప్రియా ప్రకాష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా ,అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “ఇష్క్ ” మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిఉండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: