నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా వస్తున్న సినిమా SR కళ్యాణమండపం EST 1975. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈఏడాది మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు SR కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Aug 6th 2021 -Mark the date ❤️#SRkalyanamandapam pic.twitter.com/k0WhEK9YT4
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 12, 2021
కాగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రమోద్ – రాజు ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























