గత ఏడాది కరోనా వల్ల థియేటర్లు మొత్తం మూతపడిన సంగతి తెలిసిందే కదా.. ఈఏడాది ఎలాగోలా ఓపెన్ చేసినా కొద్దిరోజులు మాత్రమే ఆ సందడి సాగింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉదృతంగా మారడంతో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ తీసినా కానీ థియేటర్ల ఓపెన్ చేయకూడదని అనుకున్నా కానీ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని కోరనా నిబంధనలు ప్రకారం థియేటర్లు ఓపెన్ చేసుకోడానికి అనుమతులు ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఏపీలో థియేటర్లు ఓపెన్ అవ్వనున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ప్రారంభం పై కీలక ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో జూలై 8 వ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో థియేటర్లు తెరుచుకోనున్నాయి.
ఇక ఇప్పుడు దాదాపు అన్నిసినిమాలు పెండింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక థియేటర్లు తెరుచుకోవడమే ఆలస్యం అన్ని సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























