మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. శ్రీ సింహా నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 27వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈకార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథిలుగా వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను.. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు.. నా పిల్లలు అభయ్, భార్గవ్ పెద్దయ్యాక ఏదైనా సాధిస్తే ఇలానే ఇబ్బందిపడతానేమో అని ఇప్పుడు తెలుస్తోంది. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి.. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దోహదపడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్.. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం” అని ఎన్టీఆర్ ముగించాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























