పవవ్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ అయితే జరుపుకుంటుంది. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి శివరాత్రికి అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తిండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు తాజాగా ఆ అప్ డేట్ ఏంటో తెలుపుతూ టైమ్ ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు.. సాయంత్రం 5.19 నిమిషాలకు టైమ్ ఫిక్స్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పీరిడియాడిక్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీగా సెట్ వేయనున్నారుట. పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి గండికోట రాజ్యం సెట్ వేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు పవన్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























