బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింతో తెలుసు కదా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్గా నిలిచింది. ఇక అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ డెబ్యూ హీరో ఏ డెబ్యూ హీరోకి రాని కలెక్షన్స్ రాబట్టుకొని కొత్త రికార్డులు సృష్టించాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక తాజాగా ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని’ఉప్పెన’ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Time and again it is proved that nothing can stop Good Cinema ❤️#100CroreGrossForUppena 🌊
మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు 🙏❤️#BlockbusterUppena#Uppena#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/lAWjiaVjc4
— Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2021
కాగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























