ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఒక్క నాగ్ అశ్విన్ తో సినిమా తప్పంచి మిగిలిన మూడు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాాగా సలార్ రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేస్తు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సలార్‌ను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
𝐑𝐞𝐛𝐞𝐥𝐥𝐢𝐧𝐠 Worldwide #Salaar On 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒, 𝟐𝟎𝟐𝟐 💥
We can’t wait to celebrate with you all 🔥#Salaar14Apr22#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @BasrurRavi @bhuvangowda84 pic.twitter.com/tQ3B1jbdt1
— Hombale Films (@hombalefilms) February 28, 2021
కాగా ప్రభాస్ హీరోగా కె.జి.యఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బొగ్గు నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామిని ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























