కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ముందే ప్రకటించారు చిత్రయూనిట్. ఫిబ్రవరి 24 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ మూవీని జయలలిత జయంతి సందర్భంగా ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
To Jaya Amma, on her birthanniversary
Witness the story of the legend, #Thalaivi, in cinemas on 23rd April, 2021. @thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media #SprintFilms @ThalaiviTheFilm pic.twitter.com/JOn812GajH— Kangana Ranaut (@KanganaTeam) February 24, 2021
కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: