కపటధారి థీమ్ ట్రైలర్ రిలీజ్

Kapatadhaari Movie Theme Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kapatadhaari Theme Trailer,Kapatadhaari Trailer,Kapatadhaari Movie,Kapatadhaari Movie Teaser,Kapatadhaari,Kapatadhaari Movie Telugu Trailer,Kapatadhaari Movie Official Trailer,Sumanth Kapatadhaari,Sumanth Kapatadhaari Movie,Latest Telugu Trailers,Kapatadhaari Movie Trailer,Kapatadhaari Theme Trailer Telugu,Kapatadhaari Theatrical Trailer,Kapatadhaari Movie Official Theme Trailer,Kapatadhaari​​ Theme Trailer,Sumanth,Swetha Nanditha,Simon K King,Pradeep Krishnamoorthy,Kapatadhaari On Feb 19th,Kapatadhaari,Kapatadhaari Movie Updates,Kapatadhaari Telugu Movie,Kapatadhaari Movie Theme Trailer,Kapatadhaari Movie Theme Trailer Release

ఈ మధ్య విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సుమంత్. ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం సినిమాల తర్వాత ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు ‘కపటధారి’ అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో చేయిఫా సుమంత్ నటించారు. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా థీమ్ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ తో ఇప్పటికే అంచనాలు పెంచిన చిత్రయూనిట్.. ఈ థీమ్ ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెంచారు . ఆర్కియాల‌జీలో ఎప్పుడో జ‌రిగిన హ‌త్య‌… హంత‌కుడు ఎవ‌రో తెలియ‌దు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా అంతు ప‌ట్ట‌ని ఆ హంత‌కుడు ర‌హ‌స్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్ట‌ర్ ఎలా చేధించాడ‌నే కథాంశంతో రూపొందిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘క‌ప‌ట‌ధారి’.

కాగా ఈ సినిమాను క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా… నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ‌సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.