యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ.. ప్రకటిస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. ఇక షూటింగ్ దశలో ఉండగానే లూసిఫర్ రీమేక్ ను కూడా రీసెంట్ గా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రెండు సినిమాలతో పాటు మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఇదిలా ఉండగా బాబి తో కూడా చిరు సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. కానీ ఈ సినిమాపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చింది. తాజాగా ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోని పోస్ట్ చేయగా దాన్ని బట్టి బాబితో సినిమా చేస్తున్నట్టు అర్థమైంది. తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేయగా.. ఈ పిక్‌లో చిరు మధ్యలో ఉండగా.. అటువైపు, ఇటువైపు మెహర్ రమేష్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీ ఉన్నారు. అంతేకాదు ఈ ఫొటోలు ఈ నలుగురు నా కెప్టెన్లు అంటూ ప్రకటించారు. దీనితో ఈ నలుగురితో చిరు సినిమాలు చేయబోతున్నట్టు కన్ఫామ్ అయింది.
My 4 Captains Ee naluguru
Funtastic 4 Char kadam@sivakoratala @jayam_mohanraja @MeherRamesh @dirbobby pic.twitter.com/sn3AaGsAFR— Chiranjeevi Konidela (@KChiruTweets) January 22, 2021
ఇక కొద్దిరోజుల్లో లూసిఫర్ షూటింగ్ పూర్తి అవ్వనుంది. ఈలోపు లూసిఫర్ రీమేక్ ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టనున్నారు. మధ్యలో మెహర్ రమేష్‌తో చేసే సినిమాని స్టార్ట్ చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నారట. మెహర్ రమేష్‌తో చేసే సినిమా సెట్‌పై ఉండగానే.. బాబీతో చేసే సినిమాని ప్రారంభించాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది చిరు రెండు సినిమాలతో సందడి చేసేలా కనిపిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























