అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే జంటగా రూపొందిన లవ్ స్టోరీ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా ఒక స్టైలిష్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనీ , హీరో అఖిల్ తన పాత్రకు ప్రిపేర్ అవుతున్నారనీ , ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయ్యే ఈ మూవీ షూటింగ్ ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరుపుకోనుందనీ సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: