‘ఆదిపురుష్’ మోషన్‌ క్యాప్చర్‌ వర్క్ స్టార్ట్

Director Om Raut Along With His Team Is All Set To Begin The Shoot Of Adipurush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas New Movie News,Actor Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Telugu,Adipurush Update,Adipurush Latest Update,Prabhas Starrer Adipurush Update,Adipurush Motion Capture Shoot,Adipurush Motion Capture,Adipurush Motion Capture Sequences Begins,Saif Ali Khan,Update About Adipurush,Adipurush Movie Shoot,#Adipurush

తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఓం రౌత్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ఓం రౌత్. ఈ సినిమా మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఈరోజు నుండి చిత్ర యూనిట్‌ ప్రారంభించినట్టు తెలిపాడు. ఇక ఈ టెక్నాలజీని ఇంటర్నేషనల్‌ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి హాలీవుడ్ మూవీలతో పాటు రజినీ నటించిన ‘రోబో’, ‘కొచ్చాడియన్’ సినిమాలకూ ఈ ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.