భరతనాట్యం డ్యాన్సర్ , థియేటర్ ఆర్టిస్ట్ మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి “సరిగమ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. కొన్ని తమిళ మూవీస్ లో అద్వైత పేరుతో నటించిన కృతిశెట్టి , బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన “ఉప్పెన ” మూవీ లో కథానాయికగా నటించారు. భారీ అంచనాలు ఉన్న “ఉప్పెన ” మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరో గా రూపొందుతున్న యాక్షన్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో ముగ్గురు కథానాయికలలో ఒకరిగా కృతి శెట్టి నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు , కృతిశెట్టి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందే మూవీ కి కథానాయికగా కృతి శెట్టి పేరు పరిశీలనలో ఉంది. హీరోలు రామ్ , నితిన్ లు తమ మూవీస్ లో కృతిశెట్టి ని కథానాయిక గా ఎంపిక చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇలా పలు మూవీ ఆఫర్స్ తో కృతిశెట్టి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























