“నేరుక్కు నేర్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన సూర్య పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరో గా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హీరో సూర్య కు అభిమాన గణం అధికమే. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను ప్రేక్షకులకు అందించిన సూర్య “రక్త చరిత్ర 2” తెలుగు స్ట్రెయిట్ మూవీ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “ఆకాశం నీ హద్దురా !” మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి సూర్య ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సినీ సెలబ్రిటీస్ సాధారణంగా బయటకు వచ్చినప్పుడు మేకప్ తో ఉంటారన్న విషయం తెలిసిందే. మూవీ హీరోలు మేకప్ లో ఒక లాగా , మేకప్ లేకుండా ఒకలాగా కనిపిస్తారు. ఇప్పుడున్న స్టార్ హీరోస్ ఆల్ మోస్ట్ 40ప్లస్ వయస్సు వారే. అందరికీ జుట్టు తెల్లబడిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో అజిత్ తెల్ల గడ్డం , మీసంతో సినిమాలలో నటించి అభిమానులను అలరిస్తారు. ఇప్పుడు సూర్య హోమ్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన తరువాత తన సహజ లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. అక్కడక్కడా తెల్ల జుట్టుతో ఉన్న సూర్య లుక్ అభిమానులను ఆకట్టుకుంది. హీరో సూర్య తన సహజ లుక్ తో ఒక్క మూవీ లోనైనా నటిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























