కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఓటీటీ లో రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. రీసెట్ గా గువ్వ గోరింక అనే సినిమాను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను తాజాగా ట్విటర్లో షేర్ చేసిన సత్యదేవ్.. `ఈ ఫొటోను షేర్ చెయ్యకుండా ఈ ఏడాదికి ఎలా గుడ్ బై చెప్పగలను… ధన్యవాదాలు అన్నయ్య` అని ట్వీట్ చేసాడు. కాగా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సత్యదేవ్ కలిసిన సంగతి తెలిసిందే.
Can’t bid adieu to 2020 without sharing this picture.
Thank you annaya @KChiruTweets ❤️ pic.twitter.com/weOcbqiv1Q— Satya Dev (@ActorSatyaDev) December 30, 2020
ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























