సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఒక స్పెషల్ సాంగ్ ను తెరకెక్కించాలని దర్శకుడు గోపీచంద్ ప్లాన్ చేశారు. ఆ స్పెషల్ సాంగ్ కై సూపర్ హిట్ “అత్తారింటికి దారేది “, “హలో గురు ప్రేమకోసమే ” మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ ను ఎంపిక చేశారు. తెలుగు , తమిళ , కన్నడ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కన్నడ బ్యూటీ ప్రణీత ప్రస్తుతం హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























