సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ “కోబ్రా ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ కన్నడ మూవీ “కె జి ఎఫ్ చాఫ్టర్ 1 “కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధి శెట్టి కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “కోబ్రా” మూవీ లో మియా జార్జ్ , క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే విక్రమ్ “కోబ్రా” మూవీ లో 20 పైగా గెటప్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. లాక్ డౌన్ కారణంగా రష్యా షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. చెన్నై లోనే రష్యా బ్యాక్ డ్రాప్ లో సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరుపుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కోబ్రా” ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ స్పందన లభించింది. క్రిస్మస్ పండగ సందర్భంగా సెకండ్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ మూవీ తో పాటు హీరో విక్రమ్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “మహావీర్ కర్ణ” , “పొన్నియిన్ సెల్వన్ “, “విక్రమ్ 60 “మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























