“పెళ్ళిచూపులు “, “అర్జున్ రెడ్డి” ,”గీత గోవిందం “, “టాక్సీవాలా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారారు. “అర్జున్ రెడ్డి” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు విజయ్ పై తమ ప్రేమాభిమానాలు చూపిస్తారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“ఫైటర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయి ని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు 9.7 మిలియన్ , మహేష్ బాబుకు 6.1మిలియన్ ఫాలోవర్స్ ఉండగా అతి తక్కువ కాలం లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో తొలి దక్షిణాది హీరోగా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డ్ కు విజయ్ అభిమానులు తమ సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























