నారప్ప గ్లిమ్స్ వీడియో రిలీజ్ 

Latest Telugu Movies News, Naarappa, Naarappa Movie, Naarappa Movie Glimpse, Naarappa Movie Glimpse Video, Naarappa Movie Glimpse Video Is Out, Naarappa Movie Shooting Updates, Naarappa Movie Updates, Naarappa Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, venkatesh daggubati, Venkatesh Daggubati Narappa

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ పునఃప్రారంభించగా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రేపు వెంకీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర గ్లిమ్స్‌ని విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టిన రోజు కావడంతో ఇంకేదైనా అప్ డేట్ ఇస్తారేమో చూద్దాం.

కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా పాత్రలో కార్తీక్ ర‌త్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.