కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్

#KGF, Announcement From KGF Makers, KGF Chapter 1, KGF Chapter 2, KGF Movie Producer, KGF Movie Producer Announce His New Film, KGF Movie Producer Announce New Film, KGF Movie Producer New Film, KGF Movie Producer Next Project, KGF Movie Producer To Announce His New Film, KGF Movie Producer To Announce His New Film Shortly, KGF Movie Producer Upcoming Movie, Prashanth Neel, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కె.జి.య‌ఫ్ చాప్టర్ 1’ ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఇప్పుడు ఇదే సీక్వెల్ లో ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై కూడా ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమాను కూడా అలాగే రూపొందిస్తున్నారు. కరోనా వల్ల షూట్ కు కొన్ని నెలలుగా బ్రేక్ పడగా గత నెలలోనే మళ్లీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దాదాపు చివరిదశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే బ్యాన‌ర్‌లో మూడో పాన్ ఇండియా సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు కె.జి.యఫ్ నిర్మాత. భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రూపొంద‌నున్న ఈ సినిమా టైటిల్‌, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 2న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 9 నిమిషాల‌కు తెలియ‌జేస్తాం’’ అని అధికారికంగా ప్రకటించారు.

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.