రాశీఖన్నా డ్రీమ్ రోల్

Actress Raashi Khanna Reveals About Her Dream Role

సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టిన రాశీఖన్నా పలు మూవీస్ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని కోలీవుడ్ లో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “అరణ్మణై 3 “, “తుగ్లక్ దర్బార్ “మూవీ షూటింగ్స్ తో రాశీఖన్నా బిజీగా ఉన్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ రాశీఖన్నా ఈ రోజు (నవంబర్ 30) బర్త్ డే జరుపుకుంటున్నారు. అభిమానులకు ఒక గుడ్ న్యూస్ , రాశీఖన్నా ఇప్పుడు మరో బిగ్ తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. “సామి “, “సామి స్క్వేర్ “మూవీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా ఒక తమిళ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో విక్రమ్ కు జోడీ గా రాశీఖన్నా ఎంపిక అయ్యారు. రాశీఖన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. మంచి నటిగా గుర్తింపు పొందాననీ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాననీ , విలేజ్ గర్ల్ తన డ్రీమ్ రోల్ అనీ , తమిళ భాష , గిటార్ నేర్చుకొనడానికి లాక్ డౌన్ సమయం ఉపయోగపడిందనీ , తన హెల్త్ , ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.