బిగ్ బాస్ 4-కమాండోలుగా మారిన కంటెస్టెంట్లు

Bigg Boss Telugu 4 Show Day"72" Highlights: Contestants Undergoes Through Commando Training

బిగ్ బాస్ 4 – మొన్న రాత్రి ఎపిసోడ్ తో సీరియస్ గా మారిన హౌస్ నిన్న కాస్త కూల్ అయింది. ఎపిసోడ్ స్టార్టింగే అరియానా సోహైల్ మాట్లాడుకుంటారు.. అరియానా ఈసారి ఎవరి కోసం త్యాగం చేయమని అనకండి.. నేను అయితే ఎవరి కోసం చేయను.. 12వ వారం వచ్చేసింది.. సోహెల్ నువ్వు నాకోసం త్యాగం చేస్తావా చెప్పు అంటే చేయను అంటాడు.. నేను నీ కోసం చేస్తానా అంటే నువ్వు అసలే చెయ్యవు అని అనుకుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ ఇల్లు క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. ఈ టాస్క్‌లో యూనిఫామ్ ధ‌రించిన ఇంటిస‌భ్యులు కొన్ని డ్రిల్స్ చేయాలి. అఖిల్‌ కేడ‌ట్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ట్రంపెట్ సౌండ్ వ‌స్తే మార్చి ఫాస్ట్‌, ఎక్స‌ర్‌సైజ్‌, గ‌న్‌షాట్స్ వ‌స్తే దాక్కోవ‌డం, ప‌వ‌ర్ సేవ్ అన‌గానే ఫ్రీజ్ అవ‌డం, స్లో మోష‌న్ అన్న‌ప్పుడు స్లో మోష‌న్‌లో, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ అన్న‌ప్పుడు ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌లో, డ్ర‌మ్ రోల్స్ వ‌స్తే నేల‌పై పాక‌డం వంటివి అన్నీ చేయాలి. బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్య‌క్తి ఒక ఛాలెంజ్ చేసే అవ‌కాశం పొందుతారు. ఇలా నాలుగు సార్లు బ‌జ‌ర్ మోగుతుంది. ఒక‌సారి ఛాలెంజ్ పూర్తి చేసిన వ్య‌క్తికి మ‌రోసారి బ‌జ‌ర్ కొట్టే అవ‌కాశం లేదు.

టాస్క్ మొద‌ల‌వ‌గానే అందరూ టాస్క్ లోకి వెళ్లిపోయారు. బిగ్ బాస్ ఇచ్చిన సౌండ్స్ ను బట్టి స్టంట్లు చేశారు. అయితే ఈ టాస్క్ మాత్రం హౌస్ మేట్స్ కు కాస్త కష్టంగానే మారిందని చెప్పొచ్చు. మొద‌టి బ‌జ‌ర్ మోగ‌గానే సోహైల్ అన్నింటిక‌న్నా క‌ఠిన‌మైన‌ ఛాలెంజ్ స్వీక‌రించాడు. ఇందులో సోహైల్ స్విమ్మింగ్ పూల్‌లో ఒక‌వైపున ఉన్న బ‌రువైన వ‌స్తువుల‌ను మ‌రోవైపుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ను సోహెల్ చేయలేకపోయాడు. త‌ర్వాత బ‌జ‌ర్ కొట్టిన అఖిల్‌.. పోల్‌ను వాటేసుకుని కిందకు దిగ‌కూడ‌ద‌న్న స‌వాలు స్వీక‌రించి విజ‌యం సాధించాడు.

త‌ర్వా‌త అభి బ‌జ‌ర్ కొట్టి మంకీ బార్ ఛాలెంజ్ స్వీక‌రించి గెలుపొందాడు. త‌ర్వాత బ‌జ‌ర్ కొట్టిన హారిక టైర్‌ను గార్డెన్ ఏరియాలో ప‌ది రౌండ్లు ఫ్లిప్ చేసే స‌వాలును స్వీక‌రించి పూర్తి చేసింది. ఇక ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసిన ముగ్గురికి స్టార్స్ వచ్చాయి. దీనితో వీరు ముగ్గురు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

ఇక ఈ రోజు హౌస్ లోకి కంటెస్టెంట్ ల పేరెంట్స్ వస్తున్నారు. చూడబోతే హౌస్ మొత్తం ఫుల్ ఎమోషన్ తో నిండిపోయేలా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.