వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు యంగ్ గా , అందంగా మారుతున్నారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ తో మహేష్ టైమ్ స్పెండ్ చేశారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న “సర్కారు వారి పాట “మూవీ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
7 నెలల తరువాత మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో హాలీడే ట్రిప్ కు దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే. హాలీ డే ట్రిప్ ను మహేష్ &ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. హీరో మహేష్ బాబు ఫొటోలను ఆయన సతీమణి నమ్రత రెగ్యులర్ గా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో ఉన్న ఫొటోను నమ్రత షేర్ చేశారు. హాలీవుడ్ హీరో లుక్ లో ఉన్న మహేష్ బాబు ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























