ఇప్పుడంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. ఇక టాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి. అయితే ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మనకు తెలియని కొన్ని విషయాలు మాత్రం ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం మనం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
* రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఆసినిమాలో ప్రభాస్ ట్రైసెప్స్ ను చూపించిన సీన్ కూడా గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఆ సీన్ లో నటించింది ప్రభాస్ కాదు అనేది నిజం. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ లా ఉండే అతనే ఈ సీన్ లో నటించాడు.
* ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ‘మీ నాన్న టెంపర్’, ఆర్య 2 సినిమాలో ‘మై లవ్ ఈజ్ గాన్’ పాటలు కంపోజ్ చేసేప్పుడు ఇద్దరు హీరోలు చాలా హై ఫీవర్ లో వున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమ స్టెప్స్ తో జ్వరాన్ని సైతం కిల్ చేశారు.
* ప్రభాస్ బుజ్జిగాడు సినిమా చేస్తున్నప్పుడు తండ్రిగా చేసినా ఎమ్ ఎస్ నారాయణ ఏడ్చిన సీన్ గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఆ సీన్ లో ఎమ్.ఎస్ నారాయణ ఎలాంటి గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లు పెట్టుకున్నాడట. మరి ఆ సీన్ లో ఎమ్.ఎస్ నారాయణ ఎంత న్యాచురల్ గా చేసాడో గుర్తుండే ఉంటుంది కదా.
* అలీ హీరోగా చేసిన యమలీల సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలుసు కదా. అయితే ఈ సినిమాలో మొదట మహేష్ కు హీరోగా అడగటం జరిగిందట. కానీ కొన్ని కారణాల వల్ల అలీ ఈ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
* మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ సినిమాలో మహేష్ కు తాతగా నాజర్ నటించిన సంగతి కూడా విదితమే. అయితే ఈ పాత్ర కోసం మొదట శోభన్ బాబు ను అడిగారట. అయితే తాత పాత్ర అని చేయనని చెప్పారట.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























