బిగ్ బాస్ 4 – మెహబూబ్ ఔట్.. ఎమోషన్ తో నిండిపోయిన హౌస్

Bigg Boss Telugu 4 Episode "70" Highlights Mehboob Eliminated From Bigg Boss House, Teammates Gets Emotional

బిగ్ బాస్ 4 – చూస్తుండగానే 10వ ఎపిసోడ్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. మెహబూబ్ హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. మరి మెహబూబ్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో నిన్న రాత్రి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే నాగార్జున‌ ఇంటిస‌భ్యుల‌తో గ‌ద్ద కుందేలు ఆట ఆడించారు. మొద‌ట గ‌ద్ద‌గా మారిన అభి కుందేలుగా ఉన్న ఇంటిస‌భ్యుల్లో నుంచి అఖిల్‌ను ప‌ట్టుకుని గద్ద‌గా మార్చేశాడు. ఇలా గేమ్ పూర్త‌య్యేస‌రికి సోహైల్‌ విన్నర్ అవ్వగా, అరియానా రన్నర్ గా మిగిలింది. ఆ త‌ర్వాత అరియానా సేఫ్ అయిన‌ట్లు తెలిపారు. అనంత‌రం విన్నర్ అయిన సోహెల్, రన్నర్ అయిన అరియానాను ఇద్దరు టీమ్ లీడర్స్ గా పెట్టి మరో గేమ్ ఆడించారు. టీం సభ్యులు బొమ్మ గీస్తే మిగ‌తావాళ్లు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సోహైల్ టీంలో అవినాష్‌, అఖిల్‌, హారిక.. అరియానా టీంలో మెహ‌బూబ్‌, లాస్య‌, అభిజిత్‌, మ‌రో టీమ్‌గా విడిపోయారు. మోనాల్ సంచాల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది. ఈగేమ్ లో సోహెల్ టీం గెలిచింది. అనంత‌రంమోనాల్, హారిక సేఫ్ అయిన‌ట్లు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చివ‌రిగా అందరూ అనుకున్నట్టే సోహైల్‌, మెహ‌బూబ్ ను డేంజ‌ర్ జోన్‌లో పెట్టాడు బిగ్ బాస్. ఫైనల్ గా మెహ‌బూబ్ ఎలిమినేట్ అయిన‌ట్లుచెప్పడంతో సోహైల్ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. హౌస్ మేట్స్ కూడా షాక్ లో ఉండి కన్నీటి వీడ్కోలు పెట్టారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన మెహ‌బూబ్ త‌న‌కు బిగ్‌బాస్ షో చాలా నేర్పింద‌ని చెప్పుకొచ్చాడు. ఒక్కొక్క హౌస్ మేట్ గురించి చెపుతూ ‘నువ్వు లేక‌పోతే నేను డ్యాన్స్ చేయ‌లేను’ అని హారికకు.. లాస్య తనకు నచ్చిన ఫుడ్ చేసి పెట్టేదని.. హౌస్‌లో అభిజిత్ త‌న‌కు అన్న‌లాగా ఉన్నాడ‌ని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇక‌ ఎవ‌రికి ఆరోగ్యం బాగోలేక‌పోయినా మోనాల్ ద‌గ్గ‌రుండి చూసుకుంటుంద‌ని, హౌస్‌లో బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ అవినాష్ అని, అఖిలే నంబ‌ర్ 1 అని మెహ‌బూబ్ చెప్పుకొచ్చాడు.

ఇక సోహెల్ మాట్లాడుతూ.. మొన్న‌ మాస్ట‌ర్ పోయాడు, త‌ర్వాత అఖిల్ వెళ్లొచ్చాడు, ఇప్పుడు మెహ‌బూబ్ వెళ్తున్నాడు అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. బయట చూసే వాళ్ళకి ఫేక్ ఎమోషన్ అనుకుంటారు కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది.. హార్ట్ తో బ్రెయిన్ తో ఆడాల్సి వస్తుంది అంటూ ఎమోషన్ అయ్యాడు. అత‌డిని ఓదారుస్తూ బిగ్‌బాస్‌లో నువ్వు ఎన్ని రోజులు ఉంటే తాను కూడా అన్ని రోజులు లోప‌ల ఉన్న‌ట్లే అని చెప్పుకొచ్చాడు. చివ‌ర‌గా ఓ హిందీ పాట‌కు డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఏడిపించేశాడు. అనంత‌రం నెక్స్ట్ వీక్‌ నాన్‌వెజ్ తిన‌కూడ‌ద‌నే బిగ్‌బాంబ్‌ను అవినాష్ మీద వేశాడు.

ఇక ఈ రోజు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. మరి ఎవరెవరు ఎవర్ని నామినేట్ చేస్తారు.. హౌస్ ఎంత హీట్ ఎక్కుతుందో తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.