జయప్రద పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల జంటగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో అన్నదమ్ముల కథగా రూపొందిన “పండంటికాపురం “(1972 ) మూవీ ఘనవిజయంసాధించి ప్రేక్షకాదరణ పొందింది. ఎస్ వి రంగారావు , గుమ్మడి , ప్రభాకర్ రెడ్డి , దేవిక , జమున , బి. సరోజాదేవి , అల్లు రామలింగయ్య , రాజ బాబు వంటి నటీనటులతో రూపొందిన “పండంటి కాపురం” బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఎస్ పి కోదండపాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




1972 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “పండంటి కాపురం” మూవీ సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. 21 సెంటర్స్ లో శత దినోత్సవం జరుపుకుంది. 12 సంవత్సరాల వయస్సు లో “పండంటి కాపురం” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జయసుధ తరువాత పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. కుటుంబ బాంధవ్యాలను “పండంటి కాపురం” మూవీని అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు లక్ష్మీ దీపక్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























