స్మార్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan Looks Smart In His Latest Pictures Shared On Social Media

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ పై కోర్ట్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక కాగా అంజలి , నివేద థామస్, అనసూయ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ “మూవీ తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొన్నటి వరకూ గుబురు గడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్మార్ట్ లుక్ లో మారారు. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =