టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. అంతేకాదు పలు విషయాలను కూడా మహేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఈ రోజు 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. షారూఖ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులుసోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్ ఖాన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బర్త్‌డే విషెస్ అందించారు. నమ్రత, షారూఖ్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన మహేష్.. నాకు తెలిసిన అత్యంత సౌమ్యులలో షారూఖ్‌ఖాన్ ఒకరు. ఆయన ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ ట్వీట్ చేసాడు.
Happy birthday to one of the most humble people I’ve known, @iamsrk! Wishing you happiness and great health always! 😊 pic.twitter.com/6oEW8xSm5A
— Mahesh Babu (@urstrulyMahesh) November 2, 2020
ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































