“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది “, “ఫలక్ నుమా దాస్ “,” HIT- ది ఫస్ట్ కేస్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ థ్రిల్లర్ “ఫలక్ నుమా దాస్ “మూవీ తో విశ్వక్ సేన్ నిర్మాత , దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం “పాగల్ “, “HIT 2” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ , లక్కీ మీడియా బ్యానర్స్ పై నూతన దర్శకుడు నరేష్ రెడ్డి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “పాగల్ ” మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 7 నెలల పాటు ఇంటికే పరిమితం అయిన హీరో విశ్వక్ సేన్ షూటింగ్ లో పాల్గొనడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. “పాగల్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత డిసెంబర్ లో “HIT 2” మూవీ షూటింగ్ లో పాల్గొంటాననీ , ఈ రెండు మూవీస్ షూటింగ్స్ కంప్లీట్ చేయడానికై ప్లాన్ చేశాననీ చెబుతూ త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం అంటూ లేటెస్ట్ ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: