దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు వస్తూనే మంచి సర్పరైజ్ కూడా ఇచ్చారు. ఇన్ని రోజులు ఎన్టీఆర్ వీడియో కోసం ఎదురు చూడగా ఇటీవలే రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మూవీలో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వారు కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు వారందరూ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసారు. తాజాగా ఐరీష్ నటి ఆలిసన్ డూడీ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చారు.. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. వెల్ కమ్ టు ఇండియన్ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ ను షూట్ చేస్తున్నందుకు చాలాసంతోషంగా ఉందని.. ప్రతి నాయిక పాత్రలో నటిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో తెలిపారు.
Welcome to Indian cinema, #AlisonDoody! Had a wonderful time shooting for your first schedule… We are glad to have you play lead antagonist #LADYSCOTT in #RRRMovie! #RRR pic.twitter.com/ELNUUS0g32
— RRR Movie (@RRRMovie) November 20, 2019
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























